కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త
గతంలో అప్పుడప్పడు అక్కడక్కడా భర్త భార్యని అంతమొందించాడని అరుదుగా వింటుటాం. అంతేకాకుండా భార్య తన భర్తను హత్య చేసిందని కూడా వినే ఉంటాం. కానీ ఈ రోజుల్లో నిత్యం ఇటువంటి హత్యలు జరగటం,వినటం దురదుష్టకరం. అయితే ఇటువంటి ఘటనే తాజాగా కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

ఈ గ్రామంలో ఉదయం ఒక ఇంట్లో భార్య భర్తలు గొడవపడ్డారు. ఈ గొడవలో భర్త భార్యను దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం తాను కూడా గొడ్డలితో నరుక్కుని బలవర్మణానికి పాల్పడ్డాడు. దీంతో ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు చిట్యాల గ్రామానికి చేరుకున్నారు. అయితే పోలీసులు,స్థానికులు ఇచ్చిన సమాచరం మేరకు ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఎస్.సంజీవులు (28),అతని భార్య రమ్య(26)ను గొడ్డలితో నరికి చంపాడు. తరువాత అతను గ్రామ పొలిమేరల్లోకి వెళ్ళి నరుక్కొని చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సివుంది.