home page slider

భర్త కళ్లెదుటే భార్యపై వేధింపులు

హైదరాబాద్ లోని బేగంపేటలో దారుణం చోటు చేసుకుంది. భర్త ఎదుటే భార్యపై కొందరు ఆకతాయిలు వేధింపులకు గురి చేశారు. నోటికొచ్చిన అసభ్యకర మాటలతో రెచ్చిపోయారు. కాసేపు నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నంబర్ ఇవ్వు అంటూ అడ్డంగా బీరు బాటిళ్లతో హల్ చల్ చేశారు. బాధిత వివాహిత తన భర్త, ప్రెండ్స్ తో కలిసి నిన్న రాత్రి బేగంపేట క్లబ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద భర్తపై ముగ్గురు యువకులు దాడి చేయగా.. వారి నుంచి తప్పించుకొని డయల్ 100కు కాల్ చేశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు పంజాగుట్టకు చెందిన డి. సంపత్, సందీప్, కూకట్ పల్లికి చెందిన ఉమేశ్ లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.