National

‘వైఫ్ స్వాపింగ్ గేమ్’ ఆడలేదని భార్యపై భర్త కిరాతక చర్య

బికనీర్ : మనసర్కార్

మానవజాతి సిగ్గుతో తలవంచుకునే దారుణ సంఘటన బికనీర్‌లో జరిగింది. తన సొంత భార్యను వైఫ్ స్వాపింగ్ గేమ్ లో పాల్గొనలేదని కిరాతకంగా హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆధునికత పేరుతో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్న ఇలాంటి పిచ్చి ఆటలను ఎవరూ సమర్థించరు.

అధికారులు చెప్పిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లోని బికనీర్‌లోని ఒక హోటల్‌లో జరిగింది ఈ ఘటన. భర్త అమర్ బికనీర్‌లోని 5 star హోటల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతడు తన భార్యను తీసుకొచ్చి హోటల్ రూమ్‌లో రెండురోజుల పాటు బంధించాడు. అనంతరం ఆమెను భార్యలను మార్చుకునే ఆట ఆడమని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆమె తీవ్రగాయాలతో తప్పించుకుని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఆమె అత్తమామలు, ఆడపడుచు ఆమె భర్తతో కలిసి 50 లక్షల కట్నం కావాలని డిమాండ్ చేస్తున్నారని కూడా ఆమె కంప్లైంట్ చేసింది. వారు ఆమెను ఆధునికంగా ఉండడం లేదని కూడా హింసిస్తున్నారని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఆమెను వారి బంధువుల ఇంటికి పంపించారు. ఆమె అత్తమామలు, భర్తపై వరకట్న వ్యతిరేకచట్టం, ఇంకా గృహహింస చట్టాలపై కేసును నమోదు చేశారు పోలీసులు.