Home Page SliderTelangana

పరాయి మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికన భర్త

GHMC అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న జానకిరామ్‌ రాసలీలలు బయటపడ్డాయి. వేరే మహిళతో ఉండగా అతని భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. జానకిరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని అక్కడే ఉంటుండగా భార్య కళ్యాణి పట్టుకొని ఇద్దరిని చితకబాదింది. కుటుంబాన్ని వదిలేసి గత కొద్దిరోజులుగా జానకి రామ్ సికింద్రాబాద్ లోని వారాసిగూడ అపార్ట్‌మెంట్‌లో ఆ అమ్మాయితో ఉంటున్నాడు. భర్త రోజుల తరబడి ఇంటికి రాకపోవడంతో ఎక్కడి వెళుతున్నాడని భార్య కళ్యాణి నిఘా పెట్టింది. వారాసిగూడలో అపార్టుమెంట్ లో ఉన్న ఇద్దరిని భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. విషయం తెలుసుకున్న వారాసి గూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు.