కరెంట్ షాక్‌కు గురై భార్యాభర్తలు మృతి
ఆరుబయట దండెంపై ఆరేసిన బట్టలు తీస్తుండగా కరెంట్ షాక్‌కు గురై దంపతులు మృతి చెందారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని హనుమాన్ బజార్‌లో పల్లపు ఆంజనేయులు, నర్సమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఇనుప రాడ్‌పై ఉన్న టవల్‌ను తీస్తుండగా కరెంట్ ప్రసారమై నర్సమ్మ షాక్‌కు గురైంది. గమనించిన భర్త ఆంజనేయులు ఆమెను తప్పించబోయాడు. ఈ క్రమంలో ఆయనకు కూడా విద్యుత్ షాక్ తగలడంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.