Home Page SliderNational

త్వరపడండి..భలే మంచి చౌక బేరం..

శ్రావణమాసం మొదలు పండుగల సీజన్ మొదలయినట్లే. వినాయక చవితి నుండి న్యూఇయర్ వరకూ పండుగల సీజన్ కారణంగా భారీ డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు వ్యాపారస్తులు. ఏ వస్తువైనా కొనాలని ఎదురుచూసేవారికి  ఇప్పుడు భలే మంచి చౌక బేరంగా చెప్పవచ్చు. దుస్తుల నుండి ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్ వస్తువుల వరకూ కొనుగోళ్లు, అమ్మకాలకు ఇది మంచి తరుణంగా భావించవచ్చు. చాలా కంపెనీలు సంవత్సరంలో తమ అమ్మకపు లక్ష్యాలలో దాదాపు 50 శాతం వరకూ ఈ సమయంలో సాధించుకుంటారు. కార్లు, బైక్‌లపై కూడా డిస్కౌంట్లు మొదలయ్యాయి. దసరా, దీపావళి సమయాలలో అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలు కూడా భారీ ఆఫర్లను ప్రకటిస్తాయి.