నీటిముంపులో వందల కార్లు
విజయవాడ నగరం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. సింగ్ నగర్‌లో ఉన్న టాటా కార్ల షోరూం, గోడౌన్‌లో వందల కార్లు నీటిముంపులో ఉన్నాయి. దీనితో సిబ్బంది ఆ నీటిని బయటకు పంపడానికి, నీరు తోడడానికి ప్రయత్నిస్తున్నారు. సగానికి పైగా నీటిలో మునిగి ఉన్నాయి. దీనితో కొత్త కార్లు ఇలా అయిపోవడంతో భారీ నష్టం వాటిల్లవచ్చని షోరూం యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలలో 15 వేల మందికి పైగా ఉన్నారు. 70 వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. డ్రోన్లతో, హెలికాఫ్టర్లతో నిత్యావసరాలు, పాలు, నీరు సరఫరా చేస్తున్నారు.