ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేపై వంద కోట్ల పరువు నష్టం దావా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో సంఘ్ అనుబంధ విశ్వహిందూ పరిషత్ యువజన విభాగం బజరంగ్ దళ్‌ను, నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)తో సమానంగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ… దాఖలైన పిటిషన్లో, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేపై 100 కోట్ల పరువునష్టం కేసులో పంజాబ్ కోర్టు సమన్లు జారీ చేసింది. “బజరంగ్ దళ్ హిందుస్థాన్” అధ్యక్షుడు హితేష్ భరద్వాజ్ ఫిర్యాదుతో సంగ్రూర్ జిల్లా కోర్టు కాంగ్రెస్ అధ్యక్షుడికి సమన్లు జారీ చేసింది. ఇటీవల ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్‌ను “సిమి, అల్-ఖైదా వంటి దేశ వ్యతిరేక సంస్థల”తో పోల్చిందని పిటిషనర్ ఆరోపించాడు. బజరంగ్ దళ్ అని పేరు పెట్టి, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో “మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం లేదా ద్వేషాన్ని” ప్రోత్సహించే సంస్థలను నిషేధిస్తామని హామీ ఇచ్చిందని విమర్శించాడు.

“కులం లేదా మతం ఆధారంగా వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై దృఢమైన, నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. భజరంగ్ దళ్, PFI, లేదా అలాంటి వ్యక్తులు, సంస్థలు పవిత్రమైన చట్టం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేవని విశ్వసిస్తున్నామని కాంగ్రెస్ అభిప్రాయపడింది. మెజారిటీ లేదా మైనారిటీ వర్గాల మధ్య శత్రుత్వం లేదా ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై నిషేధం విధించడంతోపాటు చట్టం ప్రకారం ‘నిర్ణయాత్మక చర్య’లు తీసుకుంటామని కాంగ్రెస్ పేర్కొంది. కర్నాటకలో అధికారంలోకి వస్తే ‘సర్వ జనాంగద శాంతియ తోట’ (అన్ని వర్గాల శాంతియుత ఉద్యానవనం) సాధ్యమవుతుందని ఆ పార్టీ పేర్కొంది.

మల్లేశ్వరం నియోజక వర్గంలో తన స్థానాన్ని నిలబెట్టుకున్న కర్ణాటక మంత్రి సిఎన్ అశ్వత్నారయన్, ఫలితాల రోజున, బజరంగ్ దళ్‌ను నిషేధించాలని కాంగ్రెస్‌కు సవాలు విసిరారు. బజరంగ్‌దళ్‌పై నిషేధం విధించడంపై వారికి ఎంత ధైర్యం.. వాళ్లను ప్రయత్నించనివ్వండి.. మేం ఏం చేయగలమో చూపిస్తాం’ అని అన్నారు. బజరంగ్ బలి భక్తులను లాక్కోవాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ పార్టీ అందుకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘జై బజరంగబలి’ అని నినాదాలు చేయాలని “సంస్కృతిని దుర్వినియోగం” చేసేవారిని శిక్షించాలని ప్రధాని ఓటర్లను కోరారు. దీంతో “బజరంగ్ దళ్‌ను నిషేధించే ప్రతిపాదన ఏమీ లేదని” కాంగ్రెస్ పార్టీ ప్రకటించాల్సి వచ్చింది. ఎందుకంటే అలాంటి సంస్థలను నిషేధించడం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తోందంది. కానీ హనుమంతుడిని బజరంగ్ దళ్‌తో సమానం చేయడం ద్వారా భక్తుల “మతపరమైన మనోభావాలను ప్రధాని దెబ్బతీశారని” కాంగ్రెస్ ఆరోపించింది. అందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.