గురుగావ్‌లో సినీ ఫక్కీలో భారీ ట్రక్ ‘ఛేజింగ్ సీన్’
ఆవులను అక్రమంగా తరలిస్తున్న భారీ ట్రక్‌ను ఛేజ్ చేసి పట్టుకున్నారు గురుగావ్ పోలీసులు. నిన్న రాత్రి గురుగావ్ వద్ద టోల్‌గేటు వద్ద ఆగకుండా గేట్‌ను తోసుకుంటూ దూసుకుపోయింది ఒక భారీ ట్రక్. సిబ్బంది బిత్తరపోయారు. టోల్ సిబ్బందికి తృటిలో ప్రమాదం తప్పింది. దీనితో పోలీసులు కూడా ట్రక్‌ను ఛేజ్ చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రక్ ముందు టైరు బరస్ట్ అవడంతో ట్రక్ స్లో అయ్యింది. టైర్ పేలినా వాహనం ఆపకుండా వేగంగా వెళుతున్న డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ వాహనం వేగంగా వెళుతున్న దృశ్యాలన్నీ వీడియో తీసారు. వందలాది ఆవులు ఆ ట్రక్‌లో కనిపించడంతో అవాక్కయ్యారు పోలీసులు.