Andhra PradeshHome Page Slider

వైసీపీ నేతలంతా ప్రజల్లోనే

  • 175 నియోజకవర్గాల్లో సందడి సందడిగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం
  • ఏడు లక్షల మంది సొంత టీం తో 14 రోజులపాటు కార్యక్రమాలు
  • తొలిరోజు పెద్ద ఎత్తున స్పందన

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సందడి సందడిగా ప్రారంభమైంది. 14 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని ఆ దిశగా స్టిక్కర్లు కూడా అంటించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇటీవల జరిగిన వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. శుక్రవారం ఉదయం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు ఆయా ప్రాంతాల్లోని గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లతో కలిసి ప్రజల వద్దకు వెళ్లారు.

ఆయా ప్రాంతాల్లో పేదల ఇళ్లకు వెళ్లడంతో పాటు గత చంద్రబాబు ప్రభుత్వానికి ప్రస్తుత వైయస్ జగన్ ప్రభుత్వానికి ఉన్న తేడాను అందుకు సంబంధించిన ప్రయోజనాలను తెలియజేస్తూ వస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుండటంతో నేతలు మరింత ఉత్సాహంతో మండుటెండను సైతం లెక్కచేయకుండా కార్యక్రమాన్ని కొనసాగించారు. రానున్న రెండు వారాల్లో 1.65 కోట్ల గడపలకు వె ళ్లేలా లక్ష్యాలను నిర్ణయించుకున్నారు. మొత్తం మీద తొలి రోజు కార్యక్రమం అంచనాలకు మించి విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంలో ఉన్నారు.