భారీగా తగ్గిన టమాటా ధర.. రైతుల నిరసన
గత కొద్ది రోజుల నుండి టమాటా ధర భారీగా పడిపోయింది. కొనుగోలుదారులకు ఇది సానుకూల అంశమే అయినప్పటికీ రైతులకు మాత్రం నష్టాలను తెచ్చి పెడుతోంది. రైతులు పండించిన టమాటా కిలో 5 రూపాయలు కూడా లభించడం లేదని వాపోతున్నారు. కొన్ని చోట్ల తమ పంటకు కిలో 2.5 రూపాయలు పలుకుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కుస్తే కూలీ డబ్బులు కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. రిటైల్ మార్కెట్లో కిలో 10 రూపాయల నుంచి 15 వరకు విక్రయిస్తుండగా.. రైతులకు కిలో 5 రూపాయలకే లభిస్తోంది. ఒక్కో ఎకరాకు 50 వేల రూపాయల నుంచి 70 వేలు ఖర్చు చేసినా పెట్టుబడి కూడా తిరిగి వస్తుందన్న ఆశ రైతులకు లేదని వాపోతున్నారు. అయితే.. రోడ్డు మీద టమాటాలు పోసి రైతులు నిరసన తెలుపుతున్నారు. రవాణా చార్జీలు, కూలీ చార్జీలు కూడా రావట్లేదు అని రోడ్డు మీద టమాటాలు పోసి రైతులు నిరసన తెలుపుతున్నారు.