ఐఫోన్లపై భారీ ఆఫర్లు
ఐఫోన్ ప్రియులకు శుభవార్త. అందనంత ఎత్తులో ఉన్న వాటి ధరలు ఇప్పుడు దిగొచ్చాయి. భారీగా ఉన్న వీటి ధరలపై భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఐఫోన్ 15 కొనుగోలుపై మంచి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ రూ.80 వేల వద్ద లాంచ్ అయ్యింది. ఇప్పుడు దీని ధర ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌లలో రూ.60 వేలకు అందుబాటులో వచ్చింది. ఒక్కసారిగా రూ.20 వేలు తగ్గింది. అంతేకాక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి, కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్సేంజ్ చేస్తే మరింత తక్కువ ధరకే లభిస్తోంది. ఇది సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ డిజైన్, అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా వాటర్ అండి డస్ట్ నిరోధకత కోసం ఐపీ 68 రేటింగ్ కూడా పొందింది.