”నారా”యణ సంస్థల్లో భారీగా డబ్బు పట్టివేత
చైతన్య,నారాయణ విద్యాసంస్థలకు ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది.దేశ వ్యాప్తంగా చైనా సంస్థలున్న అన్నీ చోట్ల ఆకస్మిక ఐటి దాడులు నిర్వహించింది.ముంబై,బెంగళూరు,ఢిల్లీ సహా అన్నీ నగరాల్లో ఉన్న చైనా సంస్థలపై ఐటి దాడులు చేసింది.ఈ రోజు ఉదయం 8గంటల నుంచి ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తుంది.ఇందులో భాగంగా హైద్రాబాద్ మాదాపూర్ కార్పొరేట్ ఆఫీస్‌లో దాదాపు రూ.2కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.ఇంకా లెక్కించాల్సిన నగదు చాలా ఉంది. ఆ పక్కనే మరో రెండు కార్పొరేట్ ఆఫీసులున్నాయి.వాటిల్లోనూ పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు.అన్నీ ప్రధాన నగరాల్లో ఉన్న కార్పొరేట్ ఆఫీసుల్లో సోదాలు కనీసం వారం రోజులు పట్టేట్టుందని అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా…. 2014లో ఏపిలో అధికారంలోకి రాగానే ఎలాంటి కండీషన్స్ లేకుండా చైనా విద్యాసంస్థల అధినేత నారాయణకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి మంత్రి పదవి కట్టబెట్టారు.ఇంతకీ నారాయణ విద్యాసంస్థలు పొంగూరు నారాయణవేనా …లేదా ”నారా”యణ వా అన్న సందేహం బీజెపి నేతలకు కలిగినట్లుందని ప్రచారం జరుగుతుంది. టిడిపి కి చాలా ఏళ్ల నుంచి నారాయణ విద్యాసంస్థలు బ్యాక్ బోన్ గా పనిచేస్తున్నాయి.దాంతో బీజెపికి సందేహం వచ్చి దాడులకు పురమాయించి ఉంటుందనే సందేహాలు కలగక తప్పడం లేదు.

