చుక్కల భూములలో భారీ అక్రమాలు..ఏపీ రెవెన్యూశాఖ
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో దస్త్రాల దహనం ఘటనపై అన్ని రకాల విచారణలు చేశామని భారీ కుట్ర జరిగినట్లు తేలిందని రెవెన్యూ శాఖ ప్రధానకార్యదర్శి ఆర్పీ సిసోదియా పేర్కొన్నారు. చుక్కల భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.ఈ చుక్కల భూములలో 14 వేల ఎకరాలు ఒకేసారి ఫ్రీహోల్డ్ అయ్యాయి.
సబ్ కలెక్టరేట్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం లేదన్నారు. రసాయనం వాడినట్లు తెలిసిందన్నారు. కార్యాలయంలో తప్పుడు దస్త్రాలు ఉన్నట్లు తెలిసిందన్నారు. తహసీల్దార్ నివేదికలు, సంతకాలు ఫోర్జరీ అయ్యాయని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే.

