దక్షిణకొరియాలో సీఎం రేవంత్..ఎల్‌జీ గ్రూప్ నుండి భారీ పెట్టుబడులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్విజయంగా అమెరికా పర్యటన ముగించుకుని దక్షిణ కొరియాకు చేరుకున్నారు. అక్కడ సియోల్ నగరంలో ఎల్‌జీ (ఎల్‌ఎస్) గ్రూప్ ఛైర్మన్‌తో భేటీ అయ్యారు. భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలో తెలంగాణలో పర్యటించేందుకు సంస్థ ప్రతినిధులను ఆహ్వానించారు. తెలంగాణలో విద్యుత్ కేబుల్, గ్యాస్, ఇంధన, బ్యాటరీల ఉత్పత్తిలో పెట్టుబడులపై చర్చించారు.
అమెరికాలో 8 రోజుల పాటు జరిపిన పర్యటనలో వివిధ సమీక్షా సమావేశాల వల్ల 19 కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో రూ.31,532 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారు. వీటిలో అధికంగా ఏఐ, ఫార్మా, విద్యుత్ వాహనాలు, లైఫ్ సైన్సెస్, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ వంటి రంగాలున్నాయి.

