భారీగా పెరిగిన కరోనా కేసులు.. మళ్లీ ప్రారంభమైన కరోనా కాలర్ ట్యూన్
భారతదేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,050 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 715 కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 28,303కు చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రజలకు కరోనా నివారణ జాగ్రత్తలు తెలియజేసే కాలర్ ట్యూన్‌ను కేంద్రం తిరిగి ప్రారంభించింది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్రం దీనిని ప్రారంభించింది. అయితే కరోనా దేశంలో గత ఏడాది నుంచి తగ్గు ముఖం పట్టింది. దీంతో ఆ కాలర్ ట్యూన్‌ను కేంద్రం నిలిపివేసింది. కాగా ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మరల పెరుగుతుండడంతో ఈ కరోనా కాలర్ ట్యూన్‌ను తిరిగి ప్రారంభించింది. దీనిలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించమని ,మాటిమాటికీ మీ చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించింది. అంతేకాకుండా బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని తెలియజేస్తుంది. మనిషి మనిషికి మధ్య 1m దూరం ఉండేలా చూసుకోవాలని వినిపిస్తోంది. కాగా జలుబు,దగ్గు వంటి కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా టెస్టు చేయించుకోవాలని ఈ కాలర్ ట్యూన్ తెలుపుతుంది.

