శబరిమలకు భారీ ఆదాయం
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయానికి రికార్డు స్థాయిలో భారీ ఆదాయం వచ్చింది. ఈ దేవాలయాన్ని అయ్యప్పస్వామి మాల సీజన్‌లోనే తెరుస్తారని తెలిసిందే. ఇటీవల ఆలయాన్ని తెరిచిన 9 రోజుల్లోనే 6.12 లక్షలమంది భక్తులు దర్శనానికి పోటెత్తారు. దీనితో ఈ దేవస్థానాన్ని నిర్వహిస్తున్న ట్రావెన్‌కూర్ దేవస్థానం బోర్డుకు భారీగా ఆదాయం సమకూరింది. ఈ 9 రోజులకు రూ.41.64 కోట్ల ఆదాయం వచ్చిందని ప్రకటించారు. గత సంవత్సరం 13 రోజులకు గాను రూ.13.37 కోట్లు రావడం గమనార్హం. దేవస్థానం అధికారుల భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. సన్నిధానం, పంపా, నీలక్కల్ కొండ ప్రాంతాలలో నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఉండడంతో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.