Home Page SliderTelangana

ఆక్రమించిన స్థలంలో పువ్వాడ ఆస్పత్రి కట్టారు : సీఎం

ఖమ్మం నగరంలో ఆక్రమణల వల్లే భారీ వరదలు వచ్చాయని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ఆక్రమించిన స్థలంలో ఆస్పత్రి కట్టారని సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. పువ్వాడ ఆక్రమణలపై హరీష్‌రావు స్పందించాలన్నారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెం.మీ వర్షం పడింది. ప్రభుత్వం ముందుచూపు వల్లే ప్రాణ నష్టం తగ్గిందని మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. వరదలపై హరీశ్ రావు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వరద సాయం కోసం కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చనిపోయిన కుటుంబాలకు రూ.5 లక్షల సాయం ప్రకటించినట్లు చెప్పారు.