ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం..
హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిధి దివాన్ దేవిడి ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మదీనా, అబ్బాస్ టవర్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాలుగో అంతస్తులోని వస్త్ర దుకాణం నుంచి పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 10 ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని వ్యాపారులు తెలిపారు. సుమారు 30కి పైగా బట్టల షాపులు దగ్ధమయ్యాయి. రంజాన్ పండుగ నేపథ్యంలో తెచ్చిన కొత్త స్టాకు కాలి బూడిద కావడంతో వ్యాపారులు తీవ్రంగా నష్ట పోయినట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.