Home Page SliderNews AlertTelanganatelangana,

మాదాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో రాయదుర్గం నాలెడ్జి సిటీ వద్ద ‘సత్వ’ భవనంలో నేటి తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ భవనంలో 5 వ అంతస్తులో ఈ సంఘటన జరుగగా, ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ నడుస్తోంది. సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది రెండు యంత్రాలతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ భవనంలో అగ్ని ప్రమాదం కారణంగా గ్యాస్ సిలెండర్లు పేలడంతో భవనం పాక్షికంగా దెబ్బతింది. ఈ భవనానికి దగ్గరలోని సాఫ్ట్ వేర్ కంపెనీల నుండి ఉద్యోగులను ఇళ్లకు పంపించారు.