హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్‌లోని జీడిమెట్ల వద్ద ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ మూడవ అంతస్థులో ప్లాస్టిక్ పరిశ్రమ ఉంది. దీనికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు 1 వ అంతస్థుకు కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నాయి. రెండు ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు భయభ్రాంతులవుతున్నారు. దీనితో పరిశర ప్రాంతాలు ఖాళీ చేస్తున్నారు.