కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు
కాలిఫోర్నియాలో భారీ కార్చిచ్చు రేగింది. లాస్ ఏంజెల్స్ సమీపంలో ఉన్న పర్వత ప్రాంతాల్లో చెలరేగిన మంటలు క్రమంగా సమీప ఇళ్లకు వ్యాపించాయి. దీంతో అధికారులు సుమారు 10 వేల మందిని నివాసాలు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్చిచ్చుతో విద్యుత్ సరఫరా నిలిచిపోగా వేలాదిమంది అంధకారంలో మగ్గుతున్నారు. కార్చిచ్చును ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలను అదుపు చేయడం సవాల్ గా మారింది. ఇప్పటి వరకూ అందరూ సురక్షితంగానే ఉన్నారని అధికారులు తెలిపారు.

