Home Page SliderTelangana

బోరబండలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ బోరబండలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బోరబండలోని ఒక డీజిల్ బంకులో ఈ ప్రమాదం జరిగింది. బంకు పక్కన ఒక కారు పార్క్ చేసి ఉండడంతో దానిలో కూడా మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దగ్గరలో బాటిల్‌లో పెట్రోల్ అమ్ముతున్న దుకాణంలో ఈ మంటలు చెలరేగాయి. బాటిల్‌లో పెట్రోల్, డీజిల్ వంటివి అమ్మడం, కొనడం నేరమని తెలిసినా కూడా కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడి, ప్రమాదాలకు కారణమవుతున్నారు.