విశాఖ జగదాంబ కూడలిలో భారీ అగ్ని ప్రమాదం
విశాఖలోని జగదాంబ కూడలి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాగా అక్కడ ఉన్న ఇండస్ ఆసుపత్రిలో భారీగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో ఆసుపత్రి రెండో అంతస్తు నుంచి భారీగా పొగలు వ్యాపిస్తున్నాయి. దీంతో ఇండస్ ఆసుపత్రిలోని రోగులు భయంతో పరుగులు తీశారు. అయితే కొందరు రోగులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆసుపత్రి అధికాారులు అక్కడ ఉన్న రోగులను అంబులెన్స్ వేరే ఆసుపత్రులకు తరలించారు.కాగా దీని గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం వారు 2 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.