భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం..
జమ్ముకాశ్మీర్ లోని కథువాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శివనగర్ లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఇల్లంతా దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో ఊపిరాడక మంటల్లో ఆరుగురు సజీవ దహన మయ్యారు. మరో ముగ్గురు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. వీరికి ట్రీట్ మెంట్ కోసం కథువా లోని జీఎంసీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు.