Home Page SliderNational

కేరళలోని మందిరంలో భారీ అగ్ని ప్రమాదం..150 మందికి గాయాలు..

కేరళలోని కాసర్ గోడ్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా ఓ మందిరంలో బాణసంచా నిల్వలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. అక్టోబర్ 28న రాత్రి అంజోతంబలం వీరేకావు దగ్గర తెయ్యం ఉత్సవాల ప్రారంభ వేడుకల సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. జనం భారీగా గుమిగూడిన సమయంలో మందిరంలోని ఓ దుకాణంలో నిల్వ ఉంచిన బాణంచాలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. తర్వాత ఒకదాని తర్వాత మరొకటి పేలిపోయాయి. దీంతో అక్కడున్న భక్తులంతా భయాందోళనతో పరుగులు తీశారు. 150 మందికి పైగా మంటల్లో చిక్కుకున్నారు. గాయాలైన వాళ్లను వెంటనే స్థానిక ఆస్పత్రులకు అధికారులు తరలించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరి మంటలను అదుపు చేశారు.