InternationalNews Alert

ఇన్‌స్టాగ్రామ్‌కు భారీ జరిమానా

ఇన్‌స్టాగ్రామ్‌ మనందరికీ సుపరిచితమే. ఫేస్‌బుక్ సొంతమైన ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌కు భారీ జరిమానా రూపంలో షాక్ తగిలింది. తన టీనేజ్ యూజర్ల గోప్యతా నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌కు ఐర్లాండ్ డేటా ప్రైవసీ రెగ్యులేటర్ రికార్డు స్థాయిలో 405 మిలియన్ యూరోల (402 మిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. ఈకేసు 2020 లో ప్రారంభమైంది. ఈ విచారణలో 13-17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న టీనేజ్ యూజర్ల డేటాపై ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించిందని డేటా ప్రొటెక్షన్ కమిషన్ ఆరోపణలు చేసింది.

ఈ తీర్పుపై అప్పీలు చేయాలని ఇన్‌స్టాగ్రామ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. గత ఏడాది తమ సెట్టింగులను ఇన్‌స్టాగ్రామ్ అప్‌డేట్ చేసింది. ముఖ్యంగా టీనేజర్ల కోసం కొత్త ఫీచర్లను లాంచ్ చేసినట్లు వారి ప్రతినిధి తెలిపారు. ఈ జరిమానాను విభేదిస్తున్నామని పేర్కొన్నారు.