Breaking NewsHome Page SliderInternationalNews

నేపాల్-టిబెట్‌ సరిహద్దుల్లో భారీ భూకంపం..52 దాటిన మృతుల సంఖ్య

మంగళవారం ఉదయం నేపాల్- టిబెట్ సరిహద్దులలో ‘లబుచె’ అనే ప్రదేశంలో భారీ భూకంపం వణికించింది. దీని తీవ్రత 7.1 గా రిక్టర్ స్కేల్‌పై నమోదయ్యింది. ఈ ఘటనలో పలువురు మృత్యుపాలయ్యారు. టిబెట్‌లో ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకూ 52 మృతదేహాలు వెలికి తీశారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చైనా అధికారిక మీడియా వెల్లడించింది.  టిబెట్‌లోని షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఈ భూకంపం ఉదయం 6.35 గంటలకు సంభవించగా, టిబెట్ రీజియన్‌లో వెంటవెంటనే మరో రెండు సార్లు భూకంపం 4.7, 4.9 గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంప తీవ్రత వల్ల చైనాలో, బంగ్లాదేశ్, భారత్‌లోని ఉత్తరాది ప్రాంతాలలో కూడా భూమి కంపించింది.