చైనాలో భారీ భూకంపం.. 56 మంది మృతి
చైనాలో భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయప్రాంతమైన సిచువాన్ ప్రావన్స్ లుడింగ్ కౌంటీలో సంభవించిన ఈ ప్రకంపనాలతో 46 మందికి పైగా చనిపోయారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైంది. నీళ్లు, కరెంటు సరఫరా,రవాణా, టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. కరువు, కొవిడ్ ఆంక్షలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నఈ ప్రావిన్స్ ప్రజలపై ఇది మరో పిడుగుపాటు. ప్రధాన భూకంపం తర్వాత కూడా స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు భయపడుతున్నారు.

కంగ్డంగ్ నగరానికి 43 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదే సించువాన్ ప్రావిన్స్‌లో 2008లోనూ అతి పెద్ద భూకంపం సంభవించింది. ఆ ఘటనలో 69 వేల మందికి పైగా చనిపోయారు. మరో 18,222 మంది అదృశ్యమయ్యారు. వారంతా శిథిలాల కింద చిక్కుకొని చనిపోయారని భావిస్తున్నారు.