Home Page SliderNational

ఎయిర్ పోర్ట్ లో భారీ డ్రగ్స్ పట్టివేత

ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఓ ప్రయాణికుడి నుంచి రూ.29.28 కోట్ల విలువ చేసే హెరాయిన్ సీజ్ చేశారు. రోజువారి తనిఖీల్లో భాగంగా బ్యాంకాక్ నుంచి ఓ ప్రయాణికుడి వద్ద హెరాయిన్ ను గుర్తించారు. పాలిథిన్ కవర్లో హెరాయిన్ ప్యాకింగ్ చేసి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. హెరాయిన్ ఎక్కడికి, ఎవరికి తరలిస్తున్నారనే అంశంపై నిందితుడిని అధికారులు విచారిస్తున్నారు.