తనయుడి పుట్టినరోజు సందర్భంగా భారీ విరాళం
టిడిపి నేత నారా లోకేష్, బ్రాహ్మణిల ముద్దుల తనయుడు చిన్నారి దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతీ సంవత్సరం మార్చి 21 వతేదీన తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానానికి విరాళం అందిస్తారు ఆ దంపతులు. అలాగే ఈరోజు కూడా ఒకరోజు అన్న ప్రసాదానికి 33 లక్షల రూపాయల విరాళం తిరుమల దేవస్థానానికి అందింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో డిస్‌ప్లే బోర్డులో ప్రదర్శించారు.