Home Page SliderNational

“ఇండెక్సేషన్ రద్దు వల్ల రియల్ ఎస్టేట్‌లో భారీగా నల్లధనం”-మండిపడ్డ ఆప్ ఎంపీ

కేంద్రబడ్జెట్‌లో ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా మండిపడ్డారు. ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా నల్లధనం వచ్చి చేరుతుందన్నారు. దీనిని పునరుద్ధరిస్తేనే భారత్‌లో పెట్టుబడులు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ట్యాక్స్ వల్ల పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తారని, వారికి జరిమానా విధించినట్లవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల పాత ఆస్తులను విక్రయించే వ్యక్తులు అధిక పన్నులు చెల్లించాల్సి ఉంటుందని రాఘవ్ చద్దా తెలిపారు. ఇండెక్సేషన్ పద్దతి వలన బాండ్లు, ఇళ్లు, స్టాక్ వంటి పెట్టుబడులు ద్రవ్యోల్భణానికి అనుగుణంగా సర్దుబాటు అవుతాయని, కానీ వాస్తవ పెట్టుబడి విలువ తగ్గిపోతుందని పేర్కొన్నారు. అప్పటికి ఉన్న ధరలకు అనుకూలంగా సర్దుబాటు చేయడానికి ఈ ఇండెక్సేషన్ ఉపయోగపడుతుంది.