Home Page SliderTrending Today

 “వార్‌”తో హృతిక్‌రోషన్,ఎన్టీఆర్ మల్టిస్టారర్ ఫిక్స్

చిత్ర పరిశ్రమలో మరో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. కాగా త్వరలోనే బాలీవుడ్ స్టార్ హీరో,టాలీవుడ్ స్టార్ హీరో కాంబినేషన్‌లో మల్టిస్టారర్ మూవీ పట్టాలెక్కనుంది. అయితే హిందీలో హృతిక్‌రోషన్ నటించిన వార్ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో వార్ రెండవ పార్ట్‌ను కూడా  తెరకెక్కించాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఈ సినిమాలో హృతిక్‌రోషన్‌తో పాటు నటించేందుకు జూనియర్ ఎన్టీఆర్‌ను ఎంపిక చేసినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా బ్రహ్మస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాని ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ యూనివర్స్‌లోకి అడుగు పెడుతున్న  తొలి దక్షణాది కథానాయకుడు ఎన్టీఆర్ అని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ వార్-2లో షారుఖ్‌ఖాన్,సల్మాన్ ఖాన్ అతిథి పాత్రల్లో మెరవనున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్టీఆర్ RRR మూవీతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం దేశంలో పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో హృతిక్‌రోషన్,ఎన్టీఆర్‌ల క్రేజీ కాంబినేషన్ ఆసక్తి రేకెతిస్తుంది.