ఈ ఏడాది వర్షాలు ఎలా కురుస్తాయంటే… వాతావరణ శాఖ అంచనా ఇదే!
దేశంలో ఈ ఏడాది సాధారణ రుతుపవనాలకు ఛాన్స్
కీలక విషయాలను వెల్లడించిన వాతావరణ శాఖ
ఈ ఏడాది దేశంలో వర్షపాత సాధారణ స్థితిలో ఉంటుందని… రుతుపవనాలు ఒక మోస్తరుగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసిన ఒక రోజు తర్వాత ప్రభుత్వం కీలక విషయాలను వెల్లడించింది. నైరుతి రుతుపవనాల సమయంలో వాయువ్య భారతదేశం, పశ్చిమ, మధ్య ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

లా నినా పరిస్థితులు ముగియడం, ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ సంవత్సరం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. అయితే భారతదేశంలో ఎల్‌నినో, రుతుపవన వర్షాల మధ్య సంబంధం ఉండబోదని.. వాటిని పట్టించుకోనక్కర్లేదని వాతావరణ కార్యాలయం తెలిపింది. ఎల్ నినో ప్రభావం వల్ల అన్నీ సమస్యలే అనుకోవడానికి ఏమీ లేదంది. జులైలో ఎల్‌నినో పరిస్థితి సాధ్యమయ్యే అవకాశం ఉన్నందున, ఇది సీజన్ రెండో భాగంలో రుతుపవనాలపై మాత్రమే ప్రభావం చూపుతుందంది.

భారతదేశం 2023లో ఎల్ నినో దక్షిణ అమెరికా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో నీటి వేడెక్కడాన్ని సూచిస్తోందన అభిప్రాయపడింది. ఎల్ నినో కారణంగా, ఇండియాలో రుతుపవనాలను బలహీనపర్చనుంది. ఈ నెల ప్రారంభంలో, వాతావరణ శాఖ ప్రకారం, దేశంలోని అనేక ప్రాంతాలు, వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతాన్ని మినహాయించి, ఏప్రిల్ నుండి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ అభిప్రాయపడింది. IMD 1901లో లెక్కల వివరాలు సేకరిస్తున్న దగ్గర్నుంచి 2023లో భారతదేశంలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు ఫిబ్రవరిలో నమోదయ్యాయి. ఐతే అనుకోకుండా కురిసిన వర్షాల కారణంగా మార్చిలో ఉష్ణోగ్రతలు అదుపులో ఉన్నాయి.

