హైదరాబాద్‌ను వరదల నుండి రక్షించారిలా..
గతంతో పోలిస్తే భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో హైదరాబాద్ రోడ్లను గమనించారా? రెండు రోజుల పాటు వర్షం కురిసినా గంటల వ్యవధిలోనే వరదనీరు రోడ్లపై నుండి మాయమయ్యింది. హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి రక్షించడానికి 2022లో తెలంగాణ ప్రభుత్వం 24 డ్రైనేజ్ ప్రాజెక్టులను రూపొందించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 25.96 కిలోమీటర్ల డ్రైనేజ్ పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు తాజా ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టులకు రూ. 7,937 కోట్లు కేటాయించింది. దీనితో డ్రైనేజ్ వ్యవస్థను మరింత పఠిష్టంగా రూపొందించితే వరద ముప్పు తగ్గే అవకాశం ఉంటుంది.