Home Page SliderTrending Today

ఇలా చేస్తే ఇంట్లో బల్లులు మాయం !

బల్లులు సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అయితే కొన్ని ఇళ్ళలో వీటి బెడద ఎక్కువగా ఉంటుంది. గది గోడల మీద, షెల్ప్ లలో.. ఇలా ఎక్కడ చూసినా బల్లులు కనిపిస్తూ చిరాకు తెప్పిస్తాయి. వేసవి ప్రారంభం నుంచి వర్షాకాలం ముగిసే వరకు ఇళ్లలో బల్లుల భీభత్సం ఉంటుంది. ఇంట్లో బల్లుల బెడదను తగ్గించేందుకు కొందరు వెల్లుల్లి, కలరా ఉండలు ఉపయోగిస్తారు. అయితే వీటితో పాటు బల్లులను తరిమికొట్టడంలో సహాయపడే కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి. అవేంటంటే..

వేప చెట్టు : ఇంటి ఆవరణలో వేప చెట్టు నాటితే ఇంట్లోకి బల్లుల ప్రవేశం చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. దాని బలమైన వాసన కూడా బల్లిని సంచరించనివ్వదు.

తులసి : తులసి మొక్క మిథైల్ సిన్నమేట్, లినాలూల్ మరియు కర్పూరం యొక్క లక్షణాలను కలిగి ఉంటుంది.దీని కారణంగా బల్లులు వీటి వాసన నుండి పారిపోతాయి.

లెమన్ గ్రాస్: ఆయుర్వేద ఔషధంగా ఉపయోగించే ఈ గడ్డిలో ని అనే ఒక ప్రత్యేకమైన రసాయనం ఉంటుంది. ఈ వాసన బల్లులకు అంతగా నచ్చదట. దీంతో బల్లులు నిమ్మ గడ్డి ఉన్న చోట నుంచి పారిపోతాయి.

పుదీనా : దీని ఘాటైన వాసన ఆహారానికి రుచినివ్వడంతో పాటు బల్లులను కూడా తరిమి కొడుతుందట. పుదీనాలో మెంథాల్ అనే రసాయనం ఉంటుంది. ఈ వాసనకు ఒక్క బల్లి కూడా ఇంట్లో ఉండదు.

బంతి మొక్క: బంతి పువ్వుల్లో పైరెథ్రిన్, ట్రాపెజియం అనే క్రిమిసంహారకాలు ఉంటాయి. దాని వాసన కూడా బల్లిని అనారోగ్యానికి గురి చేస్తాయి. కాబట్టి ఈ మొక్క దగ్గర కూడా బల్లి కనిపించవు.