“సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో మళ్లీ ఎఫ్‌ఐఆర్ ఎలా వేస్తారు”..మాజీ సీఐడీ డీజీ ట్వీట్
టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తనపై హత్యాయత్నం కేసు వేయడాన్ని విమర్శిస్తూ మాజీ సీఐడీ డీజీ సునీల్ కుమార్ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టులో ఈ కేసు మూడేళ్లు నడిచి, తిరస్కరించబడిందని మళ్లీ ఎఫ్‌ఐఆర్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఈ కేసు ఎందుకు వేశారో వారి విజ్ఞతకే వదిలివేస్తున్నానని ట్వీట్ చేశారు. ఇది కేవలం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు కక్షసాధింపు చర్యేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్ ఒత్తిడి మేరకు సీఐడీ డీజీ సునీల్ కుమార్ తనను అరెస్టు చేశారని, కస్టడీలో హింసకు పాల్పడ్డారని కేసు పెట్టారు ఎమ్మెల్యే రఘురామ. ఈ కేసులో జగన్‌ను కూడా ముద్దాయిగా చేర్చారు. దీనిపై సునీల్ కుమార్ ఇలా స్పందించారు.