సీఎం జగన్ లాంటి నేరస్థుల నుంచి న్యాయం ఎలా ఆశించాలి: చంద్రబాబు
ఏపీలో అధికార పక్షంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు,ఎంపీలపై 408 క్రిమినల్ కేసులు ఉన్నాయని చంద్రబాబు ట్వీట్ చేశారు. కాగా ఏపీ సీఎం జగన్‌పై 11 CBI కేసులు,9 ED కేసులు ఉన్నాయన్నారు. అయితే వాటిపై ఇప్పటికీ విచారణలు జరుగుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ విధంగా ఏపీ సీఎం జగన్‌పై 31 క్రిమినల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అంతేకాకుండా ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ,ప్రభుత్వ న్యాయ ఖర్చులు 70% పెరిగాయన్నారు. మరి సీఎం జగన్ లాంటి నేరస్థులు న్యాయం చేస్తారని ఎలా ఆశించవచ్చు? అని చంద్రబాబు ట్వీటర్ వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.