భారత్‌లో అణ్వాయుధాలెన్ని? చైనా, పాకిస్తాన్ లెక్కేంటి?
అణ్వాయుధ యుద్ధ గడియలొస్తున్నాయా?
భారత్ వద్ద భారీగా అణు వార్‌హెడ్‌లు 172
నివేదిక ప్రకారం పాక్ కంటే ఇండియాలోనే ఎక్కువ
కానీ రోజు రోజుకు దూసుకుపోతున్న చైనా
అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్‌తో సహా తొమ్మిది అణ్వాయుధ దేశాలు తమ అణ్వాయుధాలను ఆధునీకరించడం కొనసాగిస్తున్నాయి. వాటిలో చాలా కొత్త అణ్వాయుధ వ్యవస్థలను 2023లో మోహరించేందుకు సిద్ధం చేసినట్లు స్వీడిష్ థింక్-ట్యాంక్ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) సోమవారం తెలిపింది. దాని విశ్లేషణ ప్రకారం చైనా అణు ఆయుధాలు జనవరి 2023లో 410 వార్‌హెడ్‌ల నుండి జనవరి 2024 నాటికి 500కి పెరిగిందని… అది పెరుగుతూనే ఉందని అంచనా వేసింది. మోహరించిన వార్‌హెడ్‌లలో దాదాపు 2,100 బాలిస్టిక్ క్షిపణులను హైఆపరేషనల్ అలర్ట్‌లో ఉంచారని, దాదాపు అన్నీ రష్యా, అమెరికా చెందినవని నివేదిక పేర్కొంది. అయితే, మొదటిసారిగా చైనా కొన్ని వార్‌హెడ్‌లను హై ఆపరేషనల్ అలర్ట్‌లో కలిగి ఉన్నట్లు విశ్వసిస్తున్నట్లు నివేదిక తెలిపింది.

2023లో తొమ్మిది అణ్వాయుధ దేశాలు అమెరికా, రష్యా,యూకే, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ — తమ అణ్వాయుధాలను ఆధునీకరించడాన్ని కొనసాగిస్తున్నాయని తెలిపింది. అనేక కొత్త అణ్వాయుధ లేదా అణ్వాయుధ సామర్థ్యం గల ఆయుధాలను మోహరించినట్లు SIPRI తెలిపింది. 2024 జనవరిలో అంచనా వేయబడిన 12,121 వార్‌హెడ్‌ల మొత్తం గ్లోబల్ ఇన్వెంటరీలో, దాదాపు 9,585 దాడి చేయడానికి సిద్ధంగా సైనిక నిల్వల్లో ఉన్నాయని పేర్కొంది. వీటిలో 3,904 వార్‌హెడ్‌లు క్షిపణులు విమానాలతో మోహరించబడ్డాయంది. వీటి సంఖ్య జనవరి 2023 కంటే 60 ఎక్కువని, మిగిలినవి సెంట్రల్ స్టోరేజీలో ఉన్నాయని తెలిపింది.

“బాలిస్టిక్ క్షిపణులపై మోహరించిన 2,100 వార్‌హెడ్‌లు అధిక కార్యాచరణ హెచ్చరిక స్థితిలో ఉంచారు. దాదాపు అన్ని వార్‌హెడ్‌లు రష్యా లేదా యుఎస్‌కు చెందినవి. అయితే మొదటిసారిగా చైనాలో కొన్ని వార్‌హెడ్‌లు హై ఆపరేషనల్ అలర్ట్‌లో ఉన్నాయని నమ్మాలి.” అని నివేదిక పేర్కొంది. థింక్-ట్యాంక్ ప్రకారం, భారతదేశం, పాకిస్తాన్, ఉత్తర కొరియాలు బాలిస్టిక్ క్షిపణులపై బహుళ వార్‌హెడ్‌లను మోహరించే సామర్థ్యం ఉన్నాయంది. రష్యా, ఫ్రాన్స్, యుకె, అమెరికాతోపాటుగా ఇటీవల చైనా ఈ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయంది. మోహరించిన వార్‌హెడ్‌లలో వేగవంతమైన పెరుగుదల కన్పిస్తున్నాయని నివేదక వెల్లడించింది. అలాగే అణ్వాయుధ దేశాలకు గణనీయంగా ఎక్కువ లక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని పేర్కొంది. రష్యా, అమెరికా సంయుక్తంగా దాదాపు 90 శాతం అణ్వాయుధాలను కలిగి ఉన్నాయని SIPRI తెలిపింది. 2023లో వారి సంబంధిత సైనిక నిల్వల పరిమాణాలు సాపేక్షంగా స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రష్యా జనవరి 2023 కంటే దాదాపు 36 వార్‌హెడ్‌లను కార్యాచరణ బలగాలతో మోహరించినట్లు అంచనా వేసింది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దండయాత్ర చేసిన నేపథ్యంలో రెండు దేశాల్లోనూ అణు బలగాలకు సంబంధించి పారదర్శకత క్షీణించింది. అణు-భాగస్వామ్య ఏర్పాట్ల గురించి చర్చలు ఉధృతంగా పెరిగాయని పేర్కొంది.

నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరిలో భారత్ వద్ద అణు వార్‌హెడ్‌లు 172 ఉండగా, పాకిస్థాన్‌లో 170 ఉన్నాయి. భారతదేశం 2023లో తన అణ్వాయుధాలను కొద్దిగా విస్తరించింది. ఇండియా, పాకిస్తాన్ రెండూ 2023లో కొత్త రకాల న్యూక్లియర్ డెలివరీ సిస్టమ్‌లను అభివృద్ధి చేయడం కొనసాగించాయని పేర్కొంది. “భారత అణ్వాయుధ నిరోధకంలో పాకిస్తాన్ ప్రధాన కేంద్రంగా ఉన్నప్పటికీ, చైనా ప్రపంచమంతా లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యంతో సహా సుదూర ఆయుధాలపై భారతదేశం పెరుగుతున్న ప్రాధాన్యతను చూపుతున్నట్లు కనిపిస్తోంది” అని నివేదిక పేర్కొంది.

చైనా తన బలగాల నిర్మాణం, రష్యా లేదా అమెరికా వలె కనీసం అనేక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను (ICBMs) కలిగి ఉండొచ్చని స్విస్ నివేదిక పేర్కొంది.అదే సమయంలో, చైనా అణు వార్‌హెడ్‌ల నిల్వ ఇప్పటికీ రష్యా, అమెరికా నిల్వల కంటే చాలా తక్కువని నివేదిక పేర్కొంది. “చైనా తన అణ్వాయుధాలను ఇతర దేశాల కంటే వేగంగా విస్తరిస్తోంది” అని SIPRI వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ప్రోగ్రామ్‌తో అసోసియేట్ సీనియర్ ఫెలో, డరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (FAS) వద్ద న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్స్ M క్రిస్టెన్‌సెన్ అన్నారు. “కానీ దాదాపు అన్ని అణ్వాయుధదేశాల్లో అణు శక్తులను పెంచుకోడానికి తగిన ప్రణాళిక సిద్ధంగా ఉన్నాయి” అని నివేదిక అభిప్రాయపడింది.