NationalNews

కేబుల్‌ బ్రిడ్జి ఎలా కూలింది? సీసీటీవీ ఫుటేజ్‌లో భయానక క్షణాలు…

కొందరు ఆకతాయి చేష్టలు చేయడం వల్లె  గుజరాత్‌లోని కేబుల్‌ బ్రిడ్జి కూలిందని అహ్మదాబాద్‌కు చెందిన విజయ్‌ గోస్వామి తెలిపారు. ఈ ప్రమాదం నుంచి గోస్వామి ఫ్యామిలీ తృటిలో మృత్యువును తప్పించుకుంది. నిన్న మధ్యాహ్నం గోస్వామి తన కుటుంబసభ్యులతో కలిసి తీగల వంతెనను చూసేందుకు వెళ్లారు. వంతెనపై సగం దూరం వెళ్లేసరికి విపరీతమైన రద్దీ కన్పించిందన్నారు. కొందరు ఆకతాయిలు కావాలనే వంతెనను ఊపారు. వద్దని వారించినా వారు వినిపించుకోలేదు. దీంతో ప్రమాదం జరగొచ్చునని భావించి తన ఫ్యామిలీని సగం దూరం నుంచి వెనక్కి తీసుకొచ్చేశానన్నారు. ఈ ఆకతాయిల గురించి బ్రిడ్జి నిర్వాహకులను కూడా అప్రమత్తం చేశానన్నారు. కానీ వారు పట్టించుకోలేదన్నారు. సాయంత్రానికే ఈ ఘోరం గురించి వినాల్సి వచ్చిందని గోస్వామి తెలిపారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 140 మంది మృతి చెందారు. ఘటనాస్థలంలో ఇప్పటికీ సహాయచర్యలు కొనసాగుతున్నాయి.

కేవలం 100 మందిని మాత్రమే కేబుల్‌ బ్రిడ్జి సామర్థ్యం ఉన్న వంతెనపైకి 400-500 మందిని అనుమతించారు. కేబుల్‌ బ్రడ్జి కూలిన భయానక క్షణాలను తాజాగా సీసీటీవీ ఫుటేజ్‌లో చూడొచ్చు. అందులో సందర్శకులు బ్రిడ్జిపై నిల్చుని ఉండగా… కొందరు బ్రిడ్జిని ఊపుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో కేబుల్‌ బ్రిడ్జి కుప్పకూలి అందరూ నదిలో పడి మునిగిపోయారు.