సుఖ్విందర్ సుఖు సీఎం రేసులో ఎలా గెలిచారు? (మనసర్కార్ ఎక్స్‌క్లూజివ్)
రాజకుటుంబాన్ని కాదని ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి ఇవ్వడం దేశ చరిత్రలోనే సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఇమేజ్‌తో సతమతమవుతున్న తరుణంలో తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. పార్టీలో అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన సుఖ్విందర్ సింగ్ సుఖు విజయం ఎలా సాధ్యమైందన్నదానిపై మన సర్కార్ ఎక్స్‌క్లూజివ్
సుఖుకు మద్దతుగా సగం మంది ఎమ్మెల్యేలు
నెంబర్ 1: 68 మంది సభ్యుల సభలో ఉన్న 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో, సుఖ్‌విందర్ సుఖు సగానికి పైగా మద్దతును కలిగి ఉన్నారు. సొంత జిల్లా అయిన హమీర్‌పూర్‌లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, అతని తండ్రి, అనుభవజ్ఞుడైన ప్రేమ్ కుమార్ ధుమాల్‌ల సొంత జిల్లా కూడా – కాంగ్రెస్ ఐదు సీట్లలో నాలుగు గెలుచుకుంది, ఐదో సీటు సైతం రెబల్‌గా మారిన కాంగ్రెస్ నాయకుడే విజయం సాధించాడు.

రాష్ట్రంలో సొంతంగా ఇమేజ్ సంపాదన
నెంబర్ 2: ప్రత్యర్థులు ప్రతిభా సింగ్, ముఖేష్ అగ్నిహోత్రి దివంగత “రాజా” వీరభద్ర సింగ్ నీడలో రాజకీయాలను ప్రారంభించారు. రాష్ట్రంలో తన భార్యతో కలిసి, జర్నలిస్టు సుఖు ఒక ఇమేజ్ బిల్డప్ చేసుకున్నారు. ఒకప్పుడు పాలు అమ్మిన మాజీ విద్యార్థి నాయకుడు, అతని తండ్రి బస్సు డ్రైవర్ అయిన సుఖు, తన కేరెక్టర్ బిల్డప్ చేసుకోవడంలో గట్టి పట్టుదలతో పనిచేశారు. ప్రత్యర్థులకు ఇబ్బంది కలక్కుండా పార్టీ పదవుల పంపకం చేయనుంది. ముఖేష్ అగ్నిహోత్రి ఉప ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతిభా ప్రస్తుతం హిమాచల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉన్నారు. ఆమె కుమారుడు విక్రమాదిత్యకు కూడా కీలక పదవి దక్కే అవకాశం ఉంది.

సిమ్లాకు కొత్త వ్యక్తి ఏమీ కాదు
నెంబర్ 3: సిమ్లాకు కొత్తేమీ కాదు: సుఖ్‌విందర్ సుఖు హమీర్‌పూర్ జిల్లా రాజధాని సిమ్లా, ఎగువ కొండల నుండి పూర్తిగా భిన్నమైన ప్రాంతం, ఇక్కడ వీరభద్ర సింగ్ వంశం పూర్వపు రాజవంశం నుండి బలాన్ని పొందింది. కానీ సుఖు సిమ్లాకు కొత్తేమీ కాదు. అక్కడ విద్యార్థి రాజకీయాలు చేసి, రాష్ట్ర స్థాయి రాజకీయాలలో గుర్తింపు పొందాడు. సొంత జిల్లా హమీర్‌పూర్‌కి వెళ్లడానికి ముందు మునిసిపల్ ఎన్నికలల్లోనూ గెలిచాడు.

పార్టీలో క్రమక్రమంగా ఎదిగాడు
నెంబర్ 4. నాలుగు దశాబ్దాలుగా హిమాచల్‌లో పార్టీలోని దాదాపు అన్ని స్థాయిల్లో పనిచేశారు. నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి రాష్ట్ర యూనిట్ చీఫ్‌గా ఎదిగారు. తద్వారా ముఖ్యమంత్రి పీఠం రేసులో తాను ముఖ్యమన్న సందేశాన్ని పార్టీకి అందించాడు. గత సంవత్సరం మరణించిన మాజీ సీఎం వీరభద్ర సింగ్‌తో శత్రుత్వాన్ని ఎక్కడా దాచుకోలేదు. రాంపూర్-బుషహర్‌కి చెందిన “రాజా”కి తానా అంటే తందాన అనే బ్యాచ్‌లో కూడా లేకపోవడం ఆయనకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.

ఫైర్ బ్రాండ్ లీడర్‌గా గుర్తింపు
నెంబర్ 5: ‘ఫైర్‌బ్రాండ్’ అనే పదాన్ని తరచుగా హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీ ఎన్నికలలో హోరాహోరీగా పోటీ చేసిన రోజుల నుండి దానిని సొంతం చేసుకున్న సుఖ్‌విందర్ సుఖు గురించి రాష్ట్ర రాజకీయాల్లో చెప్పుకుంటారు. విద్యాపరంగా ఒక న్యాయవాదిగా గుర్తింపు పొందాడు. విజయం తర్వాత ఎలాంటి ప్రకటనలు చేయలేదు. గత రాత్రి ప్రతిభా సింగ్ మద్దతుదారులు నినాదాలు చేయడంపై ఇలా వ్యాఖ్యానించారు. “నినాదాలు ఎవరినీ ముఖ్యమంత్రిని చేయవు.”

రాహుల్ టీమ్‌లో కీలకం
నెంబర్ 6: టీమ్ రాహుల్‌లోని ప్రారంభ సభ్యులలో సుఖ్‌విందర్ సుఖు ఉన్నారు. రాజకీయ ప్రమాణాల ప్రకారం కూడా యువకుడే. 58 ఏళ్ళ వయసులో, ప్రతిభా సింగ్ కంటే పదేళ్లు చిన్నవాడు. రాజవంశ వారసుల కంటే కార్మికుడిగా మారిన నాయకుడిని ఎన్నుకోవడం, అట్టడుగు స్థాయిలో పని చేయాలనే కాంగ్రెస్ పునరుజ్జీవిత సందేశాన్ని పార్టీ అందించింది. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ముఖ్య అంశం సుఖు విషయంలో నిజమయ్యింది.

కలిసొచ్చిన ప్రియాంక ప్రచారం
నెంబర్ 7: ప్రియాంక గాంధీ 10 ర్యాలీలు నిర్వహించారు. రాహుల్ గాంధీ తన యాత్రలో బిజీగా ఉండగా ప్రియాంక అన్నీ తానై వ్యవహరించారు. అందుకే హిమాచల్ విక్టరీ క్రెడిట్‌లో ఆమె భాగస్వామి. ప్రతిభా సింగ్ ఇటీవల గాంధీల పని తీరును సీనియర్ల తరహా అభిప్రాయాలను వ్యక్తం చేసారు.

కులాల కుంపటి రాజుకోకుండా
నెంబర్ 8: ఠాకూర్/రాజ్‌పుత్‌లు హిమాచల్ జనాభాలో మూడింట ఒక వంతు మంది సంఖ్యల ప్రకారం అత్యధికులు. వీరభద్ర సింగ్ కుటుంబం కేంద్రంగా హిమాచల్ కాంగ్రెస్ రాజకీయాల్లో ఆధిపత్య పాత్రను కలిగి ఉన్నారు. అదే కమ్యూనిటీకి చెందిన మిస్టర్ సుఖుకి అత్యున్నత పదవిని ఇవ్వడం ద్వారా కుల గణితం పెద్దగా కదిలేది కాదు. ఠాకూర్‌లు, చారిత్రాత్మకంగా వెనుకబడిన దళితుల వెనుక సంఖ్యలో బ్రాహ్మణులు కూడా రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తున్నందున, ముఖేష్ అగ్నిహోత్రికి పదవిని ఇవ్వడం ద్వారా పార్టీ బ్యాలెన్స్ చేసిందని చెప్పవచ్చు.

ప్రాంతీయం విభేదాల్లేకుండా
నెంబర్ 9: సుఖు సొంత ప్రాంతం హమీర్పూర్ దిగువ-మధ్య హిమాలయాలు మరియు పెద్ద కాంగ్రా ప్రాంతంలో భాగం. రాచరిక రాష్ట్రాల రద్దు తర్వాత చాలా కాలం తర్వాత ప్రతిభా సింగ్‌ను “రాణి” అని పిలిచేవారు. సిమ్లా, ఎగువ కొండలకు అనుకూలంగా ఉన్నారని తరచుగా ఆరోపణలు ఎదుర్కొనేవారు. సుఖుకు కుర్చీ ఇవ్వడం వల్ల పార్టీకి ప్రాంతీయంగా విస్తృత స్థాయికి చేరువైంది, ఈసారి బీజేపీ కంటే కేవలం 1 శాతం అధిక ఓట్లను సాధించింది.

ఇమేజ్ బిల్డప్ కోసం హిమాచల్
నెంబర్ 10: జాతీయ స్థాయిలో, స్థానికంగానూ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇమేజ్ సమస్య ఎక్కువయ్యింది. కాంగ్రెస్ పార్టీకి… ఇతర రాష్ట్రాలలో తరతరాల మార్పుతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చిన్న రాష్ట్రమైన హిమాచల్, ఇప్పుడు అది పాలిస్తున్న మూడో రాష్ట్రం మాత్రమే. వచ్చే ఎన్నికల్లో హిమాచల్ తీర్పు కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించవచ్చు. మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ చీఫ్‌గా ఉన్నప్పటికీ పార్టీ పగ్గాలు గాంధీ కుటుంబంలోనే ఉన్నాయని తాజాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

