9 గంటలు ఆలస్యంగా వచ్చిన రైలుకు జనం ఎలా స్వాగతం పలికారంటే..!
ఇండియాలో ట్రైన్లు ఆలస్యంగా రావడం అన్నది సర్వసాధారణం.. గంట, రెండు గంటలు లేట్ అవడమన్నది జరుగుతూనే ఉంటుంది. కానీ ఒక రైలు ఏకంగా 9 గంటలు ఆలస్యంగా రావడంతో ప్రయాణీకులు సంబరాలు జరుపుకున్నారు. వాస్తవానికి అంత లేట్ వస్తే జనం విసుగు చెంది రైల్వేలను తిట్టుకుంటారు. కానీ ఇక్కడ రివర్స్ జరిగింది. 9 గంటల ఆలస్యం తర్వాత స్టేషన్‌కు చేరుకున్న రైలుకు ప్రజల స్పందన చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హార్దిక్ బొంతు అనే ఓ ప్రయాణీకుడు ట్విట్టర్‌లో షేర్ చేయడంతో సంచలనమైపోయింది. ట్రైన్ ఆలస్యంగా వస్తోందని… కొందరు ప్రయాణీకులు హోటళ్ల నుండి ఆలస్యంగా బయటకు వచ్చారని… అయినప్పటికీ రైలు ఆలస్యంగా వచ్చిందని చెప్పారు. చాలా సేపు వేచి ఉన్నాక కూడా… రైలు స్టేషన్‌కు వచ్చినప్పటికీ ప్రజలు అలసిపోయినట్లు కనిపించకుండా, నృత్యం చేస్తూ… సంబరాలు జరుపుకోడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. మా రైలు 9 గంటలు ఆలస్యంగా వచ్చింది. అది వచ్చినప్పుడు ప్రజలు ఈ విధంగా స్పందించారంటూ హార్దిక్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.
ప్లాట్‌ఫారమ్‌పై వందలాది మంది ప్రయాణికులు ఓపికగా నిలబడి, కొద్ది దూరం నుండి వస్తున్న రైలు నుండి వెలుగు రావడాన్ని చూసి సంబరాలు జరుపుకున్నారు. ప్లాట్‌ఫారమ్ పక్కన రైలు వేగాన్ని తగ్గించడంతో, ప్రజలు డ్యాన్స్, చప్పట్లతో హోరెత్తించారు. ప్యాసింజర్ రైలు రాకను సంబరాలు చేసుకోవడం చూడొచ్చు. ఎట్టకేలకు రైలు వచ్చిందన్న ఆనందంతో ఓ వ్యక్తి టేక్ ఏ బో అన్నట్టుగా వంగి వంగి నమస్కారం కూడా చేశాడు. కొంతమంది వినియోగదారులు ఈ వీడియోను ఫన్నీగా భావించగా, మరికొందరు భారతీయులు ఎలాంటి పరిస్థితి నుండి మీమ్‌ను రూపొందించడానికి ఒక మార్గాన్ని కనుగొంటారంటూ నెటిజన్లు జోకులు పేల్చారు. రైళ్లు ఆలస్యంగా రావడమన్నది ఇండియాలో సర్వసాధారణమన్న భావనను మరికొందరు వ్యక్తం చేశారు. ఐతే ట్రైన్ ఏ ప్రాంతంలో ఆలస్యంగా వచ్చిందన్నది మాత్రం తెలియరాలేదు.