Home Page SliderNational

కర్నాటకలో బొక్క బొర్లా పడిన గుజరాత్ ఫార్ములా (డేటాలో సంచలన విషయాలు)

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజినీరింగ్ ద్వారా అద్భుత విజయాన్ని అందుకొందని, ఓటింగ్ సరళి తేల్చుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ రెండు సాహసాలు చేసింది. ఒకటి బీజేపీకి లాయల్‌గా ఉన్న లింగాయత్ నాయకులను పక్కనబెట్టింది. పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది. గుజరాత్, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి అనుసరించిన ఫార్ములాను కర్నాటకలో కూడా పార్టీ ఇంప్లిమెంట్ చేసింది. ఎమ్మెల్యేల పనితీరు కంటే హిందుత్వ పార్టీని గట్టెక్కించిందన్న విశ్వాసంతో పార్టీ ఈ వ్యూహాన్ని అమలు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల డేటాను విశ్లేషిస్తే రెండు విధాలుగా బీజేపీ నష్టపోయిందని రుజవయ్యింది. లింగాయత్‌లు హస్తం పార్టీకి చేరువకాగా, బీజేపీ రెబల్స్, కాంగ్రెస్ పార్టీ విజయానికి పరోక్షంగా సహకరించినట్టయ్యింది. కాంగ్రెస్ అనుసరించిన సంకుల సమరం ఆ పార్టీ బీజేపీపై విజయం సాధించడానికి కారణమయ్యింది. కులంతో సంబంధం లేకుండా అభ్యర్థుల పనితీరును బట్టే విజయం సాధిస్తారని ఊహించడం చాలా కష్టం. సాధారణంగా, కాంగ్రెస్ AHINDA వ్యూహం (మైనారిటీలు, ఇతర వెనుకబడిన తరగతులు, దళితులపై దృష్టి సారిస్తుంది) పనిచేసినట్లు కనిపించింది. ఈ వర్గాలు కాంగ్రెస్ అభ్యర్థులకు మెరుగ్గా ఓట్లేశారు. కేవలం బ్రాహ్మణ అభ్యర్థుల్లో మాత్రమే బీజేపీకి చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించింది.

లింగాయత్ ఫ్యాక్టర్
కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన 51 లింగాయత్‌లకు ఆ వర్గాల నుంచి 75.51 శాతం ఆదరణ లభిస్తే, బీజేపీ 68 మంది అభ్యర్థుల్ని బరిలోకి దించినప్పటికీ ఆ పార్టీకి 26.47 శాతం ఆదరణే లభించింది. ఇక జేడీఎస్‌ 44 మంది క్యాండిటేట్స్‌ను పోటీకి దించగా, 4.55 శాతం ఓట్లే వచ్చాయి.

వక్కిలిక ఫ్యాక్టర్
కాంగ్రెస్ నుంచి 42 మంది వక్కిలగలను పోటీలో నిలపగా ఆ పార్టీకి 52.38 శాతం ఓట్లు లభించాయి. బీజేపీ 42 మందిని పోటీలో ఉంచితే, 23.81 శాతం, జేడీఎస్‌, అత్యధికంగా 54 మంది వక్కిలగలను పోటీకి నిలిపితే ఆ పార్టీకి 20.37 శాతం ఓట్లు లభించాయి.

ఎస్సీ ఫ్యాక్టర్
కాంగ్రెస్ పార్టీ 36 మంది ఎస్సీ అభ్యర్థుల్ని బరిలో దించగా 58.33 శాతం ఓట్లు ఆ పార్టీకి లభించాయి. ఇక బీజేపీ 37 మంది అభ్యర్థుల్ని బరిలో దించగా, 32.43 శాతం, జేడీఎస్ 33 మంది అభ్యర్థుల్ని పోటీకి నిలపగా 9.09 శాతం ఓట్లు వచ్చాయి.

ఎస్టీ ఫ్యాక్టర్
కాంగ్రెస్ పార్టీ 17 మంది ఎస్టీలకు టికెట్లు ఇవ్వగా ఆ పార్టీకి 88.24 శాతం ఓట్లు, బీజేపీ 18 టికెట్లు ఇవ్వగా ఆ పార్టీకి 11.11 శాతం, జేడీఎస్‌ 14 మందిని పోటీలో ఉంచగా, 7.14 ఓట్లు మాత్రమే పొందింది.

ముస్లిం ఫ్యాక్టర్
కాంగ్రెస్ పార్టీ 15 మంది ముస్లింలకు టికెట్లివ్వగా 60 శాతం ఓట్లు ఆ పార్టీ పొందినట్టు లెక్కలు వెల్లడిస్తున్నాయి.

బ్రాహ్మణ్ ఫ్యాక్టర్
కాంగ్రెస్ పార్టీ ఏడుగురు బ్రహ్మణ వర్గానికి చెందినవారికి టికెట్లు కేటాయించగా ఆ పార్టీకి 42.86 శాతం ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ 13 మందికి టికెట్లు ఇవ్వగా ఆ పార్టీకి 61.54 శాతం ఓట్లు దక్కాయి.

కురుబ ఫ్యాక్టర్
కాంగ్రెస్ పార్టీ 15 మంది కురబ కులస్తులకు టికెట్లు కేటాయించగా ఆ పార్టీకి ఆ వర్గం నుంచి 66.67 శాతం మద్దతు లభించింది. ఇక బీజేపీకి 28.57 శాతం, జేడీఎస్‌కు 18.18 శాతం ఓట్లు వచ్చాయి.

మోస్ట్ బ్యాక్ వర్డ్ ఫ్యాక్టర్

కాంగ్రెస్ పార్టీ అత్యంత వెనుకబడిన వర్గాల్లోని 16 మందికి టికెట్లు కేటాయించగా ఆ పార్టీకి 43.75 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ 17 మంది అభ్యర్థుల్ని పోటీలో ఉంచగా ఆ పార్టీకి 29.41 శాతం ఓట్లు వచ్చాయి. ఇక అన్ని వర్గాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ 24 మందికి టికెట్లు కేటాయించగా ఆ పార్టీకి 45.83 శాతం ఓట్లు, బీజేపీకి 40.91 శాతం ఓట్లు వచ్చాయి.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు చెందిన ఎస్సీ-రైట్ కమ్యూనిటీ (వ్యవసాయం ఆధారంగా జీవించేవారు) అభ్యర్థులపై ఫోకస్ చేయడం ఆ పార్టీకి కలిసివచ్చింది. షెడ్యూల్డ్ కులాలు/ షెడ్యూల్డ్ తెగల స్థానాల్లో కాంగ్రెస్ అద్భుత ప్రదర్శన చేసింది. 2018 ఎన్నికలతో పోల్చితే 51 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 10, జేడీ(ఎస్) నాలుగు స్థానాలు కోల్పోయింది. ఎస్సీ,ఎస్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం ఈ నియోజకవర్గాల్లో దాదాపు 9 శాతం పెరిగింది.

కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లేసిన లింగాయత్‌లు

బీజేపీకి కొంత వరకు కలిసొచ్చిన వక్కలిగ రిజర్వేషన్లు

బీజేపీ, కాంగ్రెస్ ఒకే కులానికి చెందిన అభ్యర్థులను నిలబెట్టిన నియోజకవర్గాలు కులాల వారీగా ఓటరు ప్రాధాన్యతను పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వకున్నప్పటికీ అది కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లినట్టు స్పష్టమవుతోంది. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు OBC కమ్యూనిటీకి చెందిన వారైతే, OBC కమ్యూనిటీ నియోజకవర్గంలో గణనీయమైన స్థాయిలో ఉందనుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీలు ఒకే కులానికి చెందిన ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల విషయానికొస్తే, ఒకే ఉపకులానికి చెందిన అభ్యర్థులను నిలబెట్టాయి. 102 నియోజకవర్గాలలో, కాంగ్రెస్ 32 స్థానాలు లాభపడగా, బిజెపి 19 నియోజకవర్గాలను కోల్పోయింది. లింగాయత్ అభ్యర్థులతో పాటు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రిజర్వ్ చేయబడిన నియోజకవర్గాల వారి పనితీరు కాంగ్రెస్ విజయానికి కీలకం అని తెలుస్తోంది.


ప్రధానంగా ఉత్తర కర్ణాటకలో దాదాపు మూడొంతుల మంది కాంగ్రెస్ లింగాయత్ నాయకులు విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పను పక్కన పెట్టడం, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడికి టిక్కెట్లు నిరాకరించడం ద్వారా లింగాయత్‌ వర్గాన్ని బీజేపీ వంచించిందన్న భావనను వ్యక్తి చేసి, కాంగ్రెస్ ఆ వర్గం ఓట్లను భారీగా పొందింది. జగదీష్ షెట్టర్ ఎన్నికల్లో చిత్తుగా ఓడినప్పటికీ, ఆయన ప్రభావం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చింది. బీజేపీ నుండి లింగాయత్ అభ్యర్థులపై కాంగ్రెస్ లింగాయత్ అభ్యర్థులు పోటీ చేసిన 38 నియోజకవర్గాల్లో దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చింది. 2018లో 21 స్థానాలను లింగాయత్ ఏరియాల్లో గెలుచుకోగా, 2023లో కేవలం ఎనిమిది స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ ఈ నియోజకవర్గాల్లో భారీ ఓటములను చవిచూసింది. 2018లో కాంగ్రెస్ పార్టీ కేవలం 14 స్థానాలతో విజయం సాధిస్తే, 2023లో 29 స్థానాలు గెలుపొందింది. 2023లో JD(S) ఒక్కటి మాత్రమే గెలుచుకుంది.

ఈ లాభం ఓట్ల షేర్లలో కూడా కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు లింగాయత్ అభ్యర్థులను ఎంపిక చేసిన నియోజకవర్గాలు గణనీయమైన లింగాయత్ జనాభా ఉన్న నియోజకవర్గాలుగా భావించవచ్చు. వీటిలో 38 నియోజకవర్గాల్లో, కాంగ్రెస్ ఓట్ల శాతం 7 శాతం పెరిగింది. 2023 ఎన్నికలలో దాని మొత్తం ఓట్ల శాతం కంటే చాలా ఎక్కువ. యాదృచ్ఛికంగా, బీజేపీ దక్షిణ కర్ణాటకలోని వక్కలిగలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంచి ఫలితాలను సాధించింది. ఇక్కడ, అదనంగా ఓ నియోజకవర్గాన్ని గెలుచుకుంది. ఓట్ల శాతంలో 9.5 శాతం పెరిగింది. ఇది స్పష్టంగా వక్కలిగ-ఆధిక్యత ఉన్న నియోజకవర్గాల్లో.. మూడు పార్టీలు వక్కలిగ సామాజికవర్గం నుండి అభ్యర్థులను నిలబెట్టిన.. బీజేపీకి అడ్వాంటేజ్ లభించింది. JD(S) తీవ్రంగా నష్టం పోయింది. సాంప్రదాయకంగా బలహీనంగా ఉన్న దక్షిణ కర్ణాటకలో బిజెపి ఉనికిని సూచించే అనేక కారణాల వల్ల కావచ్చు. గత నాలుగేళ్లలో చాలా మంది JD(S) ప్రస్తుత ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. రెండోది, కర్ణాటక ఎన్నికలను ప్రారంభించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మండ్యలో భారీ ర్యాలీతో సహా – దక్షిణ కర్ణాటకపై బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కలిసొచ్చిందని చెప్పొచ్చు. మొత్తంగా బీజేపీ, జేడీఎస్‌ను చావుదెబ్బతీసింది.

తిరుగుబాటుదారుల దెబ్బతో బీజేపీ విలవిల

అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కెట్లు నిరాకరించడం, వారి స్థానంలో కొత్త అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా బీజేపీ దెబ్బతింది. ఈ వ్యూహం ఇటీవల గుజరాత్ ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. అంతకుముందు మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికార వ్యతిరేకతను తగ్గించుకోడానికి సహకరించింది. బీజేపీ 21 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించింది. 224 నియోజకవర్గాలలో సగం కంటే తక్కువ కేవలం 103 మందికి మాత్రమే 2023లో టికెట్లు ఇచ్చింది. దీనికి విరుద్ధంగా, కాంగ్రెస్ ఎక్కువగా 2018 ఎన్నికలలో తృటిలో ఓడిపోయిన వారికి టికెట్లు ఇచ్చింది. పార్టీ టిక్కెట్లు నిరాకరించబడిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ప్రవేశించడం, లేదా స్వతంత్ర అభ్యర్థులుగా నిలవడం, బీజేపీకి సీట్లు ఓట్ల వాటాను కోల్పోవడానికి దారితీసింది. కాంగ్రెస్, జేడీఎస్ నుండి ఫిరాయించిన 19 మందిలో బీజేపీ 6 స్థానాలు గెలుచుకోవడం విశేషం.

వివాదాస్పద మైనింగ్ వ్యాపారి, మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి 2023 ఎన్నికలకు ముందు కల్యాణ రాజ్య ప్రగతి పక్షాన్ని స్థాపించారు. అతని పార్టీ కేవలం ఒక నియోజక వర్గాన్ని గెలుచుకున్నప్పటికీ, ప్రస్తుత బిజెపి ఎమ్మెల్యేలు రెడ్డి సోదరులుగా ఉన్న రెండు నియోజకవర్గాలతో సహా మరో మూడు నియోజకవర్గాలలో బీజేపీ ఓడిపోయింది.