హైదరాబాద్ లో భారీగా పెరిగిన ఇండ్ల ధరలు
అమ్మకాలు తగ్గినా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. గత ఏడాది సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది ఇదే త్రైమాసికంలో హైదరాబాద్ సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 2 నుంచి 25 శాతం పడిపోయినట్టు రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ ఒక నివేదికలో తెలిపింది. ఇదే సమయంలో ఈ నగరాల్లో ఇళ్ల కనీస ధరలు సగటున 23 శాతం చొప్పున పెరిగాయి. ఈ ఏడాది సెప్టెం బరు త్రైమాసికంలో హైదరాబాద్ లో 12,735 యూనిట్ల నివాస గృహాలు అమ్ముడుపోయాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 22 శాతం తక్కువ. ఇదే సమయంలో అమ్మకాలు తగ్గినా, భాగ్యనగరంలో ఇళ్ల ధరలు ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాస గృహాల్లో ఎస్ఎఫ్ఎ సగటున రూ.7,150 పలుకుతోంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 32 శాతం ఎక్కువని అనరాక్ తెలిపింది.