Home Page SliderTelangana

హోటళ్లు, షాపులు రాత్రి 12 వరకు తెరిచి ఉండనివ్వాలి: అసద్

హైదరాబాద్‌లో రాత్రి 11 గంటలకే షాపులు మూసివేయాలని, నో ఫ్రెండ్లీ పోలీస్ అంటూ వైరల్ అవుతున్న వీడియైపై అసదుద్దీన్ ట్వీట్ చేశారు. జూబ్లీహిల్స్‌లో పోలీసులు ఈ ప్రకటన చేయగలరా? ఇరానీ ఛాయ్ హోటళ్లు, పాన్ షాపులు, ఇతర వాణిజ్య కార్యకలాపాలను కనీసం రాత్రి 12 వరకూ కొనసాగనివ్వాలి. లేదంటే అంతటా ఒకే రూల్ ఉండాలి అని పేర్కొన్నారు. అయితే రాత్రి 11 కే షాపులను మూసివేయిస్తున్నారన్న వార్తలను పోలీసులు ఖండించారు.