Home Page SliderTelangana

ఎల్బీనగర్ లో కుప్పకూలిన హోటల్ గోడ.. ముగ్గురు మృతి..

హైదరాబాద్ లో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్బీనగర్ జంక్షన్ సమీపంలో ఉన్న సితారా హోటల్ సెల్లార్ లో తవ్వకాల పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ భారీ గోడ అక్కడ పని చేస్తున్న కార్మికులపై ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో భారీ మట్టి దిబ్బలు మీద పడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒకరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. మృతులంతా బిహార్ రాష్ట్రానికి చెందినవారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి విరరాలు ఇంకా తెలియాల్సి ఉంది.