ఏపీ మహిళా ఉద్యోగినులకు హాస్టళ్లు
ఏపీలో మహిళా ఉద్యోగినులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి అవసరమైన చోట్ల మహిళా హాస్టళ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రతీ జిల్లా కేంద్రాలు, డివజన్లు, కార్పొరేషన్ల పరిధిలో హాస్టళ్లు ఏర్పాటు చేయాలన్నారు. వాటితో పాటు వారి శిశువుల కోసం శిశు సంరక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వమే తగిన భవనాలను గుర్తించి అద్దెకు తీసుకుని నిర్వహించాలని ఆదేశించారు. వీటికోసం స్వచ్ఛంద సంస్థల సహాయాన్ని కూడా తీసుకోనున్నట్లు తెలిపారు.