Andhra PradeshHome Page Slider

తిరుపతిలో ఘోరం-అన్నాచెల్లెళ్ల దారుణ హత్య

పుణ్యక్షేత్రమైన తిరుపతిలో దారుణ హత్యలు జరిగాయి. అలిపిరికి సమీపంలోని కపిల తీర్థం వద్ద గల ఒక ప్రైవేట్ హోటల్ రూంలో మహారాష్ట్రకు చెందిన అన్నాచెల్లెళ్లు దారుణ హత్యకు గురయ్యారు. నాందేడ్‌కు చెందిన యువరాజ్ తన భార్య మనీషా, బావమరిది హర్షవర్థన్‌, పిల్లలు షక్షమ్, ప్రజ్ఞాన్‌లతో కలిసి నాలుగురోజుల క్రితం తిరుపతికి వచ్చారు. వీరు తిరుపతి కపిలతీర్థం వద్ద ఉన్న నంది సర్కిల్ వద్ద హొటల్‌లో దిగారు. యువరాజ్, మనీషాలకు 12 ఏళ్ల క్రితం వివాహమయ్యింది. వీరు గురువారం తిరుపతి చేరుకోగా, శుక్రవారం ఉదయం ఈ జంట హత్యలు వెలుగులోకి వచ్చాయి., సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులకు యువరాజ్ కనిపించకపోవడంతో అనుమానం బలపడింది. యువరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా పలు సంచలన విషయాలు తెలిసాయి. యువరాజ్ అన్నతో మనీషాకు వివాహేతర సంబంధం ఉందని, ఈ క్రమంలో వీరిద్దరూ ఏడాదిగా దూరంగా ఉంటున్నారని తెలిసింది. వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు మనీషా అన్న హర్షవర్థన్‌ను, మనీషాను, ఇద్దరు పిల్లలను  తిరుపతికి యువరాజే రప్పించినట్లు సమాచారం. గురువారం అర్థరాత్రి సమయంలో వీరిద్దరినీ యువరాజ్ హత్య చేశాడు. ఈ ఘటనపై నిందితుడిని అదుపులోకి తీసుకుని, అలిపిరి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.