Horoscope TodayNews

సెప్టెంబర్ 1 దిన ఫలాలు

మేష-రాశి-manasarkar.com

మేషం : రావలసిన ధనం అందకపోవటంతో ఇబ్బందులు తప్పవు. పెద్దల సలహాను పాటించి గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ ప్రేమ మీ జీవితంలో మరింత ఆనందాన్ని నింపుతుంది. రాజకీయనాయకులకు కొంత అనుకూల వాతావరణం నెలకొంటుంది. బంధు మిత్రులతో కలిసి దైవ సేవలో పాల్గొంటారు.

వృషభం : శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయటం మంచిది. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. విద్యార్థులు క్రీడా రంగాలలో బాగా రాణిస్తారు. మీ ఉన్నతిని చాటుకోడటం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు.

మిథునం : రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. కుటుంబీకులను పట్టించుకునేందుకు క్షణం తీరిక ఉండదు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుత ఆర్థిక స్థితి కొంత మెరుగనిపిస్తుంది. వాహన విషయంలో సంతృప్తి కానవస్తుంది.

కర్కాటకం : కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. మీ సంతానానికి ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులలో అవకాశం లభిస్తుంది. పుణ్య కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందజేస్తారు.

సింహం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ముఖ్యంగా ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.

కన్య : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ఊహించని ఖర్చులు, పెరిగిన అవసరంగా స్వల్ప ఇబ్బందులను ఎదుర్కొంటారు.

తుల : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వాతావరణంలో మార్పుల వల్ల మీ పనులు మందకొడిగా సాగుతాయి. అనవసరపు వివాదాల్లో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి. అందరితో కలిసివిందు, వినోదాలలో పాల్గొంటారు. మీరు చేసే పనులకు బంధువుల నుండి విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు.

వృశ్చికం : ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుట వలన మాట పడవలసివస్తుంది. కిరాణా ఫ్యాన్సీ, మందులు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు సంతృప్తికరంగా ఉంటుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారిధోరణి ఆశ్చర్యం కలిగిస్తుంది. తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.

ధనుస్సు : డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. అయిన వారిని ఆప్తులను విందు భోజనానికి ఆహ్వానిస్తారు. మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. సోదరులు మీతో అన్ని విషయాల్లోను ఏకీభవిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు.

మకరం : ప్రముఖ ఆలయాల్లో దైవదర్శనాలు శుభం. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ బంధువులను సహాయం అర్థించే బదులు..మీరే స్వయంగా ప్రయత్నం చేసుకోవడం ఉత్తమం.

కుంభం : మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరం చేస్తాయి.

మీనం : ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం కూడదు. మీమాట తీరు, పద్దతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. మీ సృజనాత్మక శక్తికి, మీ తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. గతంలో ఒకరికిచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మద్దికుంట శ్రీకాంత్ శర్మ
హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు
9849485645