Home Page SliderPoliticsTelanganatelangana,

బడ్జెట్‌పై కొండంత ఆశతో తెలంగాణ

కేంద్రప్రభుత్వం నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్‌పై తెలంగాణలో కొండంత ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రతీ సంవత్సరం వస్తుందంటూ ఎదురు చూస్తున్న అనేక అంశాలు సంవత్సరాలుగా పెండింగులో ఉన్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు విశ్వవిద్యాలయం, భద్రాద్రి జిల్లాకు మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాలు 30 ఏళ్లుగా పరిశీలనలో ఉన్నాయి. కొత్తగూడెం ఎయిర్ పోర్టు కోసం ఇటీవలే ఈ ప్రాంతంలో  ఎయిర్ పోర్టు అథారిటీ బృందం అధ్యయనం చేసింది. భద్రాచలం నుండి ఏటూరు నాగారం వరకూ జాతీయ రహదారి కోసం ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పంటల కోసం సీతారామ ప్రాజెక్టుకు నిధులు కావాలని కోరుతున్నారు. భద్రాచలానికి నూతన రైలు మార్గం, పెండింగులో ఉన్న జాతీయ రహదారి అంశాలు ఈ సారైనా సాకారమవుతాయా అని రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది.